Gudipati
Venkata
Chalam

'చలం కాన్క' - ప్రేమించే వారికి, శ్లాఘించే వారికి, ద్వేషించే వారికి, దూషించే వారికి, అల్పులకి, అధికులకి, సౌందర్యారాధకులకి, అంధులకి, సారస్వతాభిమానులకి, కవులకి, కళాప్రపూర్ణలకి, గాయక సార్వభౌములకి, ఆరాధకులకి, పతితలకి, పురుష వంచిత వనితలకి, నవ నాగరికతా నంగి నారీమణులకి, మానసోల్లాసులకి, మనోజనిత ఆత్మసాక్షాత్కార వంచకులకి, విధి వంచితులకి, అందరికీ ఇది చలం ప్రేమకాన్క. ...

పుస్త‌కావిష్క‌ర‌ణ‌


చ‌లం క‌థానిక‌లు
అనుశీల‌న‌

డాక్ట‌ర్ వావిలాల సుబ్బారావు ర‌చించిన 'చ‌లం క‌థానిక‌లు అనుశీల‌న' డిజిట‌ల్ బుక్ ఆవిష్క‌ర‌ణ 9 అక్టోబ‌ర్ 2021 సాయంత్రం అయిదు గంట‌ల‌కు జూమ్ వేదిక‌గా ప్రారంభమైంది. చ‌లం ఫౌండేష‌న్ గౌర‌వ అధ్య‌క్షుడు ఆళ్ళ గురుప్ర‌సాద‌రావు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. డాక్ట‌ర్ కాళ్ళ‌కూరి శైల‌జ‌, గోటేటి ల‌లితా శేఖ‌ర్‌, కిర‌ణ్ బాబు వ‌క్త‌లుగా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. చలం ఫౌండేష‌న్ ట్ర‌స్టీలు అరుణ పోసాని, సాయి ప‌ద్మ‌, గాలి ఉద‌య‌కుమార్ త‌దిత‌రులు స‌మావేశంలో పాల్గొన్నారు.

Chalam Kathanikalu

చ‌లం సాహిత్యం 20 వాల్యూమ్‌ల‌లో మూడు క‌థ‌ల‌వే ఉన్నాయి. ఈ క‌థ‌ల విశ్లేష‌ణ‌, అంత‌రార్థం కూడ అంద‌రికీ అందుబాటులో ఉంటే బాగుంటుంద‌ని అనిపించింది. వావిలాల సుబ్బారావు గారు త‌మ ప‌రిశోధ‌నా గ్రంథం 'చ‌లం గారి క‌థానికా సాహిత్య‌ము, అనుశీల‌న‌ము' పున‌ర్ముద్రించేందుకు అంగీక‌రించారు.  అలాగే వాడ్రేవు వీర‌ల‌క్ష్మీదేవి గారు కూడ త‌మ ప‌రిశోధ‌నా గ్రంథం స‌త్యాన్వేషి చ‌లం ను చ‌లం ఫౌండేష‌న్ తిరిగి ప్ర‌చురించేందుకు అంగీక‌రించారు. ఈ రెండు పుస్త‌కాల‌ను ముందుగా డిజిట‌ల్ ఇబుక్‌లుగా ప్ర‌చురించ‌టం ద్వారా యువ‌త‌కు చేరువ కావ‌టం సుల‌భ‌మ‌వుతుంద‌ని మేము భావిస్తున్నాం.  త్వ‌ర‌లో ప్రింట్ వెర్ష‌న్‌ల‌ను కూడ తీసుకురానున్నాం.  - ఆళ్ళ గురుప్ర‌సాద‌రావు

చ‌లం పుస్త‌కాలు

చ‌లం ఫౌండేష‌న్ 'చ‌లం చింత‌న' ప్ర‌చుర‌ణ‌లు

Chalam Sahitya Sumalu
చ‌లం సాహిత్య సుమాలు
రూ.250

ఇవి ఏళ్ళకి ఏళ్ళు చలం అనుభవాగ్నుల్లోంచి చిందించిన వెలుగు రవ్వలు. యాభై యేళ్ళ సాహిత్యపు సమర యాత్ర. ఖర్గపూర్ నివాసి చందర్ కొన్ని యేళ్ళుగా ప్రతి నిత్యం త‌న‌ను ప్ర‌భావితం చేసిన ఈ కొటేషన్స్‌ చాలా ఉత్సాహమైన పనిగా సేకరిస్తూ వొచ్చారు.

Chalam Chaitanya Jeevanam
చ‌లం చైత‌న్య జీవ‌నం
రూ.60

చలం చింతన సిరీస్‌లో వివిధ అంశాలపై చలం అభిప్రాయాలను క్రోడీకరిస్తూ చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించిన పుస్త‌కాల‌లో చ‌లం చైతన్య జీవ‌నం కూడ ఒక‌టి. దీనిని ఆళ్ళ గురుప్రసాదరావు, గాలి ఉదయ కుమార్‌ సంకలనం చేశారు.

క‌ళ‌, సినిమాలు
రూ.150

చలంగారి రచనలను ఆసాంతం పరిశీలించి, పరిశోధించి ఆయన సినీమా గురించి ఎక్కడ, ఏ చిన్న ప్రస్తావన చేసినా ఏరి కూర్చిన పుస్తకం ఇది. చలంగారి ప‌ట్లా, ఆయన రచనల ప‌ట్లా ఆళ్ళ గురుప్రసాదరావుగారికీ, గాలి ఉదయకుమార్‌ గారికీ ఉన్న భక్తి, శ్రద్ధలకు నిదర్శనం ఈ పుస్తకం. చాలా గొప్ప కృషి
- గొల్ల‌పూడి మారుతీ రావు

Book on writer chalam and films
చ‌లం సోష‌లిజం
రూ.120

చలం చింతన పేరిట వివిధ అంశాలపై చలం అభిప్రాయాలను క్రోడీకరిస్తూ చ‌లం ఫౌండేష‌న్ పుస్తకాలను ప్రచురిస్తోంది. వాటిలో మొద‌టిది 'చలం - సోషలిజం' పుస్తకం. దీనిని ఆళ్ళ గురుప్రసాదరావు, గాలి ఉదయ కుమార్‌ సంకలనం చేశారు.

Telugu Writer Chalam
*
చలం సాహిత్యం

చలం సాహిత్య సంగ్రహం 

ప్రచురణ : చలం ఫౌండేషన్‌,  కూర్పు : సి.ధర్మారావు, వావిలాల సుబ్బారావు, పేజీలు : 504 వెల : రూ.400
''చలాన్ని యిష్టమైనవాళ్ళు చదువుతారు. లేనివాళ్ళు లేదు. ఎట్లాగయినా సరే చలం సాహిత్యాన్ని రుచి చూపించి, విస్తారంగా చదవటానికి పాఠకులను ఉన్ముఖం చేయాలన్న ప్రయత్నం ఎందుకు మీకు? చలం అంత అవసరమా?'' అంటే, చలం ఇంకా అవసరమే. బహుముఖీనంగా మనసులు విప్పారాలంటే చలాన్ని చదివి తీరాలి. కాదని తిరస్కరించటానికయినా చలాన్ని ఇంకా చదవాలి. చదవకుండానే తిరస్కరించటం అసాధ్యమైన రచయిత. నిరాడంబరమైన వేగంకోసం, ఛాతీ మీద బలంగా తాటించగల తెలుగు కావ్యం కోసం ఇంకెవరి దగ్గరకు వెడతాం? చలంకాక. ఆలోచనల వెనుక మనసులో ఉండే మమతలు, స్త్రీల బాహ్య ప్రవర్తన వెనుక ఉండే అగాధమయిన ఔదార్యం ఎవరు చెప్పగలరు? చలం తప్ప? తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణించగలడో అంతదూరం ప్రయాణించిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి చలంగారొక్కరే.

*
చలం సాహిత్యం

చలం గారి ఉత్తరాలు

ఏ రచయితా తన జీవితానికి తన సాహిత్యాన్ని సమన్వయింప చేసుకోలేదు. అతను రచనలలో చెప్పింది వేరుగానూ, చేసేది వేరుగానూ వుంటుంది. కాబట్టి ఆయా రచయితల కంటే, వారి జీవితాల కంటే రచనలు గొప్పగా వెలిగి ప్రకాశిస్తాయి. కాని చలం విషయం మాత్రం ఇందుకు విరుద్ధం. చలం జీవితం చలం రచనల కంటే గొప్పగా వెలిగింది. ఆ వెలుగు ఆయన నిజాయితీ కారణంగా వచ్చినది. తన జీవితంలోని ప్రతి అంశమూ ఏ దాపరికమూ లేకుండా ఎక్కడికక్కడ లేఖలలో వ్యక్తపరుస్తూ వచ్చాడు. తన కుటుంబ సభ్యుల్నీ, స్నేహితుల్నీ, పరిచయస్తుల్నీ అందర్నీ తన రచనలలోకి తెచ్చి పాఠకులకు పరిచయం చేసాడు. ఆ విధంగా ఎందరితోనో ముడిపడి ఉన్న తన జీవితాన్ని పాఠకుల ముందు పరిచాడు. వీరేశలింగంగారికి, చింతా దీక్షితులుగారికి, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారికి, సూర్య ప్రసాద్‌గారికి, కురంగేశ్వరరావుగారికి, జీవన్‌కి, ఆళ్ళ గురుప్ర‌సాద‌రావు గారికి, ఇంకా మ‌రెంద‌రికో చ‌లం గారు రాసిన‌ ఉత్తరాల సంక‌ల‌నాలు ఇపుడు ఎంతో అరుదైన పుస్త‌కాలు.

*
చలం సాహిత్యం

క‌వి చ‌లం

క‌వి చ‌లం క‌విత‌ల‌తో ఫోటో ఆల్బం రూ.50

ONLINE RADIO

SCHOOL RADIO

Chalam Foundation works with School Radio.
School Radio Incubated at
IIMV - FIELD, Indian Institute of Management, Visakhapatnam &
NSRCEL, Indian Institute of Management, Bengaluru (IIMB).