శ్రీ‌ ప‌చ్చిపులుసు వెంక‌టేశ్వ‌ర్లు రచించిన 'ఊర్వ‌శి' పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం 29 న‌వంబ‌ర్ 2020 వ తేదీన చ‌లం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. చ‌లం 'పురూర‌వ' ఊర్వ‌శి పాత్ర‌కు ప్రాణం పోసిన శ్రీ‌మ‌తి శార‌దా శ్రీ‌నివాస‌న్ ఊర్వ‌శి పుస్త‌కాన్ని ఆన్‌లైన్ వేదిక‌గా ఆవిష్క‌రించారు. 
ఆంధ్ర ప్ర‌దేశ్ విద్యా శాఖ క‌మిష‌న‌ర్ వాడ్రేవు చిన‌వీరభ‌ద్రుడు, డాక్ట‌ర్ కాళ్ల‌కూరి శైల‌జ‌, వీర‌ల‌క్ష్మీదేవి, సుబ్బారావు, స్వేచ్ఛ‌, గాలి ఉద‌య‌కుమార్‌, అరుణ‌, సాయిప‌ద్మ‌, ఆళ్ళ గురుప్ర‌సాద‌రావు, ర‌చ‌యిత ప‌చ్చిపులుసు వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.'ఊర్వ‌శి'
 పుస్త‌కావిష్క‌ర‌ణ

More
పుస్త‌కావిష్క‌ర‌ణ

చ‌లం సంజీవ‌దేవ్

లేఖా సాహిత్యానికి ఒక అందం, అర్థం, సంపూర్ణ‌త్వం సిద్ధింప‌జేసిన ప్ర‌ఖ్యాత తెలుగు ర‌చ‌యిత గుడిపాటి వెంక‌ట చ‌లం, డాక్ట‌ర్ సంజీవ‌దేవ్‌ల మ‌ధ్య న‌డ‌చిన ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు, వారి సాహితీ ప‌య‌నాన్ని ప‌రిచ‌యం చేస్తూ చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించిన చ‌లం సంజీవ‌దేవ్ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్యక్ర‌మం అంత‌ర్జాలం వేదిక‌గా 8 న‌వంబ‌ర్ 2020 ఆదివారం సాయంత్రం జ‌రిగింది.
చలం -సంజీవ్ దేవ్ – పుస్తకావిష్కరణ  అంతర్జాల జూమ్ మీటింగ్ చాలా హుందాగా, ఒక సత్సంగంలా జరిగింది. కార్యక్రమ హోస్ట్, చలం ఫౌండేషన్ ట్రస్టీ ఉదయ్ కుమార్ గారు, సమావేశం మొదలుపెట్టి, ఇంటర్నెట్ సమావేశం అవటం వల్ల, కొన్ని సలహాలు సూచనలు చేస్తూ, చలంగుడిపాటి వెబ్సైట్ స్క్రీన్ షేర్ చేసి, ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో చెప్పారు. తర్వాత మేనేజింగ్ ట్రస్టీ అరుణ , చలం ఫౌండేషన్ కార్యక్రమాలని, ఇతర సామాజిక స్వచ్చంద సంస్థలతో ఫౌండేషన్ కార్యక్రమాలని, తెలియజేసారు. పుస్తకం ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ రామలింగేశ్వర రావు గారిని, కోరారు. పుస్తకావిష్కరణ హుందాగా జరిగింది. తర్వాత కీలకోపన్యాసం చేయవలసింది గా శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారిని కోరారు. వక్తల ఉపన్యాసం గురించి నేను గ్రహించిన సారం ఇక్కడ రాస్తున్నాను.
రామలింగేశ్వర రావు గారు: సంజీవ్ దేవ్ తో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, లేఖా సాహిత్యం మరింత రావలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
వాడ్రేవు చిన వీరభద్రుడు గారు: చలం సంజీవ్ దేవ్ ల , స్నేహాన్ని చెపుతూ, ఈశ్వర చంద్ర విద్యా సాగర్, రామ కృష్ణ పరమహంస ల కలయిక ని ప్రస్తావించారు. ప్రతీ లక్షణాలూ, ఇద్దరిలోనూ ఉన్నాయి అన్నారు. తన ఇంట్లో దొంగలు పడినప్పుడు.. సంజీవ్ దేవ్ బంగారం గుర్తు పట్టమంటే.. రూపు మారిన బంగారాన్ని.. “ రూపం వేరు గానీ , సారం అదే “ అని చెప్పినట్టు ప్రస్తావించారు. చలం -రమణ మహర్షి లో చూసిన , ఆధ్యాత్మికత, సౌందర్య దృష్టి ని ఆయనలో యోగి తత్వాన్ని పట్టి ఇచ్చేవిగా ఉన్నాయని అన్నారు. లేఖా సాహిత్యపు ఆహ్లాదత ను, ఆ వాతావరణాన్ని మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా వారిద్దరి మధ్య లేఖలు నడిచాయని అన్నారు.
వీరలక్ష్మి దేవి గారు : సంజీవ్ దేవ్, చలం మధ్య నడిచిన లేఖలు వొక మార్మికత ను, మన మనసనే క్రిస్టల్ గ్లాస్ లో కూడా “వంకర కంతలు” ని గుర్తించే విధంగా ఉన్నాయని అంటూ, పుస్తకం అందరూ చదవాలన్నది తన అభిమతం కాబట్టి బుక్ గురించి ఎక్కువగా మాట్లాడటం లేదని చెప్పారు.
రావెల సాంబ శివరావు గారు : మాట్లాడుతూ, చిత్రకారునిగా సంజీవ్ దేవ్ చిత్రాల గురించి. ముఖ్యంగా మూడు వర్ణ చిత్రాల గురించి చెప్పారు. నిశ్శబ్దాల మధ్య సంగీతం ఆయన వర్ణ చిత్రాలు అని చెప్పారు. చలం సంజీవ్ దేవ్ వంటి సమకాలీన కవి, రచయితల మధ్య నెలకొన్న మర్యాద, నిజాయితీ వాతావరణాల గురించి, తృష్ణ, సత్యం యొక్క మేలి కలయిక అని చెప్పారు.
వావిలాల సుబ్బారావు గారు : చలంని చదివేటప్పుడు మనల్ని చలం ఆవహిస్తాడని, మనం కూడా చలం అవుతామని అన్నారు. చలం రచనలపై పాశ్చాత్య రచయితల ప్రభావాలను గురించిన ప్రశ్నకు బదులిస్తూ, బెట్రాండ్ రసెల్ రచనల ప్రభావం ఉందని చెప్పారు. ఇంకో ప్రశ్న కు సమాధానం ఇస్తూ, చలం, శ్రీ శ్రీ ల మధ్య సంబంధాలను, వారి వారి దృక్కోణాలను వివరించారు. చలం రాసిన లేఖకు “యోగ్యతా పత్రం “ అనే పేరును శ్రీ శ్రీ గారే పెట్టుకున్నారు అని చెప్పారు. సుబ్బారావు గారు, చలం మీద నడిచే ఎన్సైక్లోపీడియా, ఆయన చెప్పిన మాటలు అనుభవించాల్సిందే.. అన్నీ అక్షరాల్లో వోదగవు అని నాకు అనిపించింది.
ఆళ్ళ గురుప్రసాద్ గారు : చలం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గా, చలం , షౌ గార్ల తో తన అనుబంధాన్ని, చలం ఫౌండేషన్ వేసిన పుస్తకాలను వివరిస్తూ, చలం , సభా గార్ల మధ్య నడచిన అలౌకిక, అతీంద్రియ అనుభవాలను గురించి, ఈశ్వరుని పై చలం, సభా, చింతా దీక్షితుల గార్ల వివిధ అనుభవాల గురించి చెప్పారు. మనతో మాట్లాడినట్టు ఉండే లేఖలు మనకి ఎన్నో విషయాలు చెప్తాయి. చలం పై, ఇలా చెప్పిన ప్రతీ జోస్యం నిజమైంది అని, దానికి పిచ్చమ్మ గారి మాటలే తార్కాణం అన్నారు.
బలివాడ కనకా రావు గారు: సంజీవ్ దేవ్ సాహిత్యం గురించి మాట్లాడారు. ముఖ్యంగా దీప్తి ధార, రసరేఖలు గురించి ప్రస్తావించారు
దేశరాజు, సూర్యప్రకాష్ గారు, ఝాన్సీ లక్ష్మి, శ్యామల కల్లూరి, గాంధిజీ జంగా, సి ఏ ప్రసాద్ గారు, గాలి అరుణ , వోల్గా గారు, కస్తూరి గారు, కిరణ్ గారు, రావెల సోమయ్య గారు, చంద్ర లత గారు, చాయా దేవి, స్నేహకుటి లక్ష్మి గారు, రాజశేఖర్ గారు, తాటిసేట్టి రాజు గారు (చలం శైలి లో తాను రాసిన లేఖతో, చలం ఇంటి వాతావరణాన్ని గుర్తు చేసారు ) ఇంకా చాలా చాలా మంది పాల్గొన్నారు. జూమ్ కావటం వల్ల కొన్ని పేర్లు తెలియవు , క్షమించాలి.
సాయి పద్మ వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.
~~సాయి పద్మ 

Chalam Sanjivdev

సాహిత్య సుమాలు

పుస్త‌కావిష్క‌ర‌ణ‌

Chalam Foundation

www.chalamgudipati.com

Chalam Foundation website & Ebook release function

*
Website Launch

www.chalamgudipati.com

www.chalamgudipati.com, a website on Gudipati Venkatachalam was launched here on Tuesday. The writer Chalam, who was one of the most read and who had also received strong criticism and whose works were “banned” though secretly read by society for his daring views and comments on society’s practices and treatment of women.
One of Chalam’s admirers and who moved closely with him Alla Guru Prasad had launched the website www.chalamgudipati.com prepared by another Chalam admirer Gali Udaya Kumar.  Former Vice-Chancellor of Acharya Nagarjuna University V. Balamohan Das launched an ebook, ‘Chalam Chintana Socialism’ compiled by Mr. Guru Prasad and Mr. Uday Kumar while Sai Padma of Global Aid launched the Chalanam magazine’s eight editions on the Net, which will also be available on the website.
Mr. Udaya Kumar told The Hindu that he decided to launch the website for two reasons: one is to make Chalam’s works available to the youngsters and the second reason is that print editions may not last for a very long time.
“Chalam was born 100 years ahead of his contemporaries and his thinking is 100 years ahead of the present generation. People are still afraid of accepting his thoughts. He has discussed not just the man-woman relationship but every aspect of society,” said Mr. Udaya Kumar.
At present the website has letters written by Chalam, some audio tapes and impressions about him described by some of his associates, links to cinemas inspires by Chalam apart from the book and editions of the magazine. Mr. Udaya Kumar is also planning to upload the thesis done on the writer after getting permission form the research scholars.
Mr. Guru Prasad spoke on Chalam before and after he joined Ramana Maharishi’s ashramam. K. Aruna of Vikasa Dhatri, managing trustee of Sneha Kuti Rajasekhar and several others were present. (From The Hindu)

Website Release Function
Gudipati Venkata Chalam
Andhra Jyothi Telugu Daily

చ‌లం చింత‌న - క‌ళ, సినిమాలు

 పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

*
BooK RELEASE

Chalam Sahitya Sangraham

'Chalam Sahitya Sangraham', a compilation of some of the best works of radical thinker and Telugu writer Chalam. Gudipati Venkata Chalam was one of the world’s greatest writers. While advocating freethinking, Chalam called upon individuals to have the courage to face the consequences of their action.
https://youtu.be/N-i7uapn4PU